మద్యం మత్తులో యువకుల వీరంగం

 ఓ సీఐ కొడుకు నట్టు క్యాబ్ డ్రైవర్ పై దౌర్జన్యం  వెంటపడి దాడి చేసిన యువకులు  తీవ్ర గాయాలైన బాధితు నీ ఆస్పత్రికి తరలింపు  పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు

మద్యం మత్తులో యువకుల వీరంగం

 కాజీపేట తెలంగాణ ముచ్చట్లు :

 మద్యం మత్తులో ఉన్న యువకులు క్యాబ్ డ్రైవర్ పై దౌర్జన్యం చేసి వీరంగం సృష్టించిన సంఘటన కాజీపేట చౌరస్తాలో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పిండి రవి అనే క్యాబ్ డ్రైవర్ హైదరాబాద్  వెళ్లేందుకు కాజీపేట అడ్డాలో కారు ఆపి ప్యాసింజర్ల కొరకు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ ప్లేస్ లో మూత్ర విసర్జన చేస్తుండగా డ్రైవర్ రాజు ఇక్కడ మూత్రం చేయడం వల్ల దుర్వాసన వస్తుందని డ్రైవర్ల అందరూ ఇక్కడనే కూర్చుంటామని ఆ యువకులకు సూచించారు. దీంతో కోపాదిక్తులైన యువకులకు కార్ డ్రైవర్ మధ్య వాగ్వివాదం జరిగింది. క్యాబ్ డ్రైవర్ ను నాన్న బూతులు తిడుతూ దాడి చేశారు. ఆ యువకులు తమ స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో మద్యం మత్తులో ఉన్న మరి కొంతమంది సంఘటన స్థలానికి చేరుకున్నారు ఏడుగురు యువకులు ఒక యువతి తో కలిపి ఎనిమిది మంది కలిసి క్యాబ్ డ్రైవర్ రాజును విచక్షణ రహితంగా వెంటపడి తరుముకొంటూ తీవ్రంగా గాయపరిచారు. అక్కడ ఉన్న మరో మూడు కార్ల అద్దాలు పగలగొట్టారు. తీవ్ర గాయాలైన రాజు దెబ్బలకు తట్టుకోలేక పరుగులు తీశారు అక్కడ ఉన్న పలువురు గొడవను ఆపేందుకు ప్రయత్నించగా మద్యం మత్తులో ఉన్న యువకులు జేబులోంచి చిన్నపాటి కత్తిని తీసి ప్రజలను బెదిరించాడని వారు తెలిపారు. అందులో ఒక వ్యక్తి మా నాన్న సీఐ అంటూ మరో వ్యక్తి మా నాన్న కానిస్టేబుల్ అంటూ మమ్మల్ని పోలీసులు ఏమి చేయలేరని అక్కడున్న ప్రజలను బెదిరించారని వారు తెలిపారు సంఘటన స్థలం వద్దనున్న వారిలో ఒకరు 100 డయల్ కాల్ చేయగా పోలీసులు వచ్చి ఆ గొడవ గురించి వివరాలు తెలుసుకొని యువకులను పోలీస్ స్టేషన్కు తరలించారు మత్తులో ఉన్న ఆ యువకులు పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న పోలీసులతో చాలాసేపు వాగ్వివాదం నికి దిగారు తీవ్ర గాయాల పాలైన క్యాబ్ డ్రైవర్ రాజును చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు బాధితుడు ఫిర్యాదు మేరకు 8 మంది పై కాజీపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .