స్త్రీలపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి

-జమాఅతె ఇస్లామీ హింద్ ఇంద్రనగర్ శాఖ

స్త్రీలపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

‘నైతికతే నిజమైన స్వేచ్ఛ’ మహిళా విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా జరిగే జాగృతి ఉద్యమంలో భాగంగా ఆదివారం జమాఅతె ఇస్లామీ హింద్ ఇంద్రనగర్ శాఖ ఆధ్వర్యంలో మహిళా విద్యావేత్తలతో నిర్వహించిన సింపోజియం లో ఇంద్రానగర్ అధ్యక్షురాలు హుస్సేన్ బి మాట్లాడుతూ ప్రస్తుతం మనదేశంలో మహిళల పట్ల ఉన్న సామాజిక అసమానతలు, పురుషాధిపత్యం, పక్షపాతం, వివక్షలు ఈ సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ముఖ్యంగా అణగారిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, వికలాంగ మహిళలపై జరిగే లైంగిక హింస విషయంలో మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచారం కేసు, బీహార్‌లోని గోపాల్‌పూర్‌లో 14 ఏళ్ల దళిత బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్, హత్య, ఉత్తరాఖండ్‌లోని ఉదమ్ సింగ్ నగర్‌లో ఒక ముస్లిం నర్సుపై జరిగిన అత్యాచారం, హత్య, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఒక పాఠశాలలో ఇద్దరు కిండర్ గార్టెన్ చదివే చిన్నారులపై జరిగిన లైంగిక దాడి లాంటి ఘటనలు మన దేశంలో మహిళల పట్ల వైఖరి ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తున్నాయి అన్నారు. సోషల్ వర్కర్స్ నాగమణి మాట్లాడుతూ నైతిక విలువలను ఆడపిల్లలతో సమానంగా మగ పిల్లలకు కూడా నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు. అదేవిధంగా ఆడపిల్లలకు ధైర్యాన్ని నేర్పాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. సమాజంలో మార్పు కోసం మన అందరం కృషి చేయాలని అన్నారు. నేటి పరిస్థితుల్లో జమాఅతె ఇస్లామీ హింద్ మహిళా విభాగం నిర్వహించే జాగృతి ఉద్యమం చాలా అభినందనీయమని అన్నారు. మైనార్టీ కాలేజ్ లెక్చరర్ సల్మా మాట్లాడుతూ నిజమైన స్వేచ్ఛ అంతర్లీనంగా నైతికతతో ముడిపడి ఉంది. నైతికత లేని స్వేచ్ఛ దారం లేని గాలిపటం లాంటిది- ప్రతి తుఫానుకు అది చెదిరిపోయి దుర్బలంగా మారుతుంది. స్వేచ్ఛా పోరాటంలో నైతికత లేకపోవడం అణచివేతకు, దౌర్జన్యానికి దారి తీస్తుంది. ఒక రకమైన అన్యాయాన్ని మరొకడానికి ప్రత్యామ్నాయంగా చేస్తుంది. నైతికత మన నిర్ణయాలకు పునాదిని ఏర్పరుస్తుంది. ఆ పునాది న్యాయం, ధర్మ సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. వ్యక్తులు, సమాజాలు నైతిక విలువలను పాటిస్తే సామరస్యంగా, పరస్పర గౌరవంతో జీవించగలిగే వాతావరణం సృష్టించుకోవచ్చు అన్నారు. చివరిగా క్యాంపియన్ కన్వీనర్ నాజియా మాట్లాడుతూ అనైతిక కార్యకలాపాలకు అనుకూలంగా చట్టాలను రూపొందించడం కూడా సమాజంలో నేరాలు వేగంగా వ్యాప్తి చెందడానికి దోహదం చేస్తోంది. ఈ మూల కారణాన్ని (నైతిక విలువల క్షీణత) పరిష్కరించడం ద్వారా మాత్రమే మనం సమాజంలో అర్థవంతమైన మార్పును తీసుకురాగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు ఆరిఫా జహెరా , సుశీల,రజిని ,నవ్య, ఉమా గారు. ఫాతిమా జబీన్, ఆయేషా సిద్ధిఖ , నీలోఫర్ ,వసీమా, లుబ్నా, సాలెహ బేగం... తదితరులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .