భద్రత ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్

భద్రత ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్

ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో రుణమాఫీ రైతుసదస్సు కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ భద్రత, బందోబస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలసి పరిశీలించారు.
వైరాలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ గ్రౌండ్, సభ వేదికను సందర్శించి భద్రత పరమైన ఏర్పాట్లను పరిశీలించారు.  ముఖ్యమంత్రి  పర్యటించే ప్రాంతాలలో పూర్తిస్థాయిలో నిఘా, పటిష్ట మైన బందోబస్తు ఏర్పాట్లకు అవసరమైన చర్యలపై పోలీస్ అధికారులు, సిబ్బందితో  వైరాలోని ఫంక్షన్ హల్ లో ఏర్పాటు  చేసిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భద్రత చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వాహనాలకు, ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, నగర పర్యటన సజావుగా సాగేలా 950 మంది పోలీస్ సిబ్బందితో  కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపడుతునట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, సభకు వచ్చే మార్గాలపై అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ  నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఏసీపీలు సిఐలు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .