ప్రభుత్వ ఉద్యోగికి స్వచ్ఛంద పదవి విరమణ తప్పదు

--వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ 

ప్రభుత్వ ఉద్యోగికి స్వచ్ఛంద పదవి విరమణ తప్పదు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు

 ప్రభుత్వ ఉద్యోగులు జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగిన, చివరకు పదవి విరమణ తప్పదని జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ )జిల్లా పర్యవేక్షణ అధికారి రావుల గిరిధర్ అన్నారు. శనివారం రోజు ఖిల్లా ఘనపూర్ పోలీస్ స్టేషన్లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి, నేడు స్వచ్ఛంద పదవి విరమణ చేయుచున్న జానకి రాములు (ఎస్ బి) వీడ్కోలు సమావేశం సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఖిల్లా ఘనపూర్ పోలీస్ స్టేషన్లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ, నేడు స్వచ్ఛంద పదవి విరమణ చేయుచున్న జానకి రాములు ని, ఘనంగా సన్మానించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగరీత్యా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, ఎంత ఎత్తుకు ఎదిగి న, ఉన్నత శిఖరాలు అందుకున్న, చివరికి ఉద్యోగరీత్యా చివరికి స్వచ్ఛంద పదవి విరమణ తప్పదని అన్నారు. మానవ జీవితంలో మంచి చెడులు రెండు ఉంటాయని, మంచి చేసిన వారు ఎల్లప్పుడూ గుర్తుంటారని ఎస్పీ గారు అన్నారు. ఉద్యోగం అనే మొదటి దశ ముగిసిందని, ఇక రెండో దశ కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఎస్పీ గారు అన్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు మంచి నడవడికతో సత్ప్రవర్తన కలిగి, 35 సం,,గా ఒక అజాతశత్రువుగా పేరు పొందారని ఎస్పీ గారు అన్నారు. ఈ సందర్భంగా జానకి రాములు గారు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ పరిధిలో, సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఎలాంటి ఒత్తిడి నైనా స్వీకరించి, సులభంగా సమస్య పరిష్కరించే దిశగా 35 సం,,గా వివిధ పోలీస్ స్టేషన్లో వనపర్తి రూరల్, కొడంగల్, వనపర్తి రూరల్, వనపర్తి టౌను, సిసి కుంట, మహబూబ్నగర్ టౌన్, వీపనగండ్ల, ఉమ్మడి జిల్లాలో,. చివరికి ఘనపూర్ స్పెషల్ బ్రాంచ్ లో విదులు నిర్వహిస్తూ, ఉద్యోగరీత్యా, అందరితో కలిసి మెలిసి ఉండి చివరికి ఇలా పదవి విరమణ పొందుతుంటే బాధకరంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు జానకి రాములు. నా విధి నిర్వహణలో నాకు సహకరించిన నాతోటి సిబ్బంది, నాపై అధికారులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని విషాద వదనంతో అన్నారు. ఘనపూర్ మండల ప్రజలకు రుణపడి ఉంటానని, మండల ప్రజల సహాయ సహకారం మనవదేందని, ఈ సందర్భంగా తెలిపారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .