రెపరేపలాడిన మువ్వన్నెల జెండా -- ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
-- చూపరులను ఆకట్టుకున్న విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు -- విద్యార్థులకు అందించిన బమ్మెరపోతన అవార్డ్ ఫర్ ఎక్సిలెన్సీ -- ఉద్యోగులకు ఉత్తమ సేవ అవార్డులు
వేలేరు : మండల కేంద్రం వేలేరులోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కోమి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మీ ప్రసన్న, పోలీస్ స్టేషన్లో ఎస్సై ఏ సురేష్, జెడ్పిహెచ్ఎస్ వేలేరులో హెచ్ఎం జి రాజన్న, ఎంపీపీఎస్ వేలేరులో హెచ్ఎం లీలాబాయి, మండలకేంద్రం వేలేరుతో పాటు గ్రామాలలో ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో, నలుకూడళ్లలో, అంబేడ్కర్ విగ్రహాల వద్ద, వివిద రాజకీయ, ప్రజా సంఘాల ఆద్వర్యంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం వేలేరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద జడ్పిహెచ్ఎస్ వేలేరు విద్యార్థులు పిరమిడ్ ఆకారంలో నిలబడి జాతీయ జెండాను ఊపుతూ జాతీయ ఐక్యతను తెలిపారు. ఎంపీపీఎస్ వేలేరు విద్యార్థులు వివిధ జాతీయ గేయాలకు నృత్య ప్రదర్శన చేసి గ్రామ ప్రజలను అలరించారు. '' పాటశాలల్లో " జడ్పిహెచ్ఎస్ వేలేరులో బిగ్ హెల్ప్ బమ్మెర పోతన అవార్డు ఫర్ ఎక్సలెన్సీ వారు ప్రతి సంవత్సరం అందించే మొదటి, ద్వితీయ బహుమతులను హెచ్ ఎం రాజన్న ఆద్వర్యంలో విద్యార్థులకు అందించారు. ఈ సందర్బంగా హెచ్ ఎం జి రాజన్న వివరాలు వెల్లడిస్తూ 2023 -24 సంవత్సరంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు 9 .7 జిపిఏ సాధించి మొదటి స్థానంలో నిలిచిన పల్లా సాహితి, సాహిత్యలకు రూ 3 వేలు, ద్వితీయ స్థానానికి రూ 2 వేలు ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ 3 వందలు, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ 2 వందల రూపాయల నగదును అందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో పోటీపడి ఈ విదంగా ప్రతి సంవత్సరం అవార్డులు అందుకొని జీవితంలో మంచిగా ఎదగాలన్నారు. అదేవిదంగా 2023 - 24 విద్యా సంవత్సరంలో 10 వ తరగతిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులు పల్లా సాహిత్య, సాహితిలకు వేలేరు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త గౌరీశెట్టి వెంకటేశ్వర్లు సిల్వర్ మెడల్స్ అందజేసారు. "ఉత్తమ సేవ అవార్డులు అందుకున్న వారికి అభినందన" వేలేరు పొలీస్ స్టేషన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ఎస్సై అజ్మీర సురేష్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రతిబింబించేలా ప్రజలకు సేవలందించాలన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవము సందర్బంగా ఉత్తమ సేవ అవార్డ్ పొందిన హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య ను, పిసి నుండి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన సుందర్ రాజును తన సిబ్బందితో కలిసి ఎస్సై అభినందించారు. ఎంపిడిఒ కార్యాలయం వేలేరు లో డిప్యుటేషన్ పై విధులు నిర్వహిస్తున్న టైపిస్ట్ సిహెచ్ రవీందర్, కార్యదర్శి రాజిరెడ్డి లకు ఉత్తమ సేవా అవార్డ్ రావడం పట్ల ఎంపిడిఓ లక్ష్మిప్రసన్న తన సిబ్బందితో కలిసి అబినందనలు తెలిపారు. కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


Comments