దరిపల్లి లో ఘనంగా 78 వ స్వాతంత్ర దినోత్సవం

దరిపల్లి లో ఘనంగా 78 వ స్వాతంత్ర దినోత్సవం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం కొత్తూరు గ్రామం శివారులో గల దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (బీటెక్ పాలిటెక్నిక్ ఎంబీఏ ఎంటెక్) నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ దరిపల్లి కిరణ్ మాట్లాడుతూ దేశీయ సంస్థలోనే కాకుండా విదేశాలలో అన్నిచోట్ల ప్రతి కంపెనీ లో భారతీయులు ఉన్నారని కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ని కనిపెట్టి తద్వారా భారత దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయాలని ప్రతి విద్యార్థి దాని కోసం కష్టపడి ఆలోచనాశక్తిని పదును పెట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని అభిలషించారు.

దరిపల్లి కళాశాల నందు భవిష్యత్తులో వచ్చే ఉద్యోగాలకి అవసరమైన కోర్సులు గుర్తించి వాటిని నూతనంగా పాలిటెక్నిక్ డిప్లమా, బి.టెక్ మరియు ఎంటెక్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, నెట్వర్క్, క్లౌడ్ కంప్యూటర్ అండ్ బిగ్ డేటా ప్రవేశపెట్టి తద్వారా ఖమ్మం పట్టణ మరియు రూరల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థినీ విద్యార్థుల ప్లేస్మెంట్ లక్ష్యంగా కళాశాల పనిచేస్తుందని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలకి అటెండెన్స్ పర్ఫామెన్స్ లో ముందుగా ఉన్న రమ్య మరియు అకాడమిక్స్ లో మొదటి ర్యాంకు తెచ్చుకున్న స్పందన విద్యార్థినిలకు కళాశాలకు విశిష్ట అతిథిగా విచ్చేసిన రంజిత్ గారు మరియు కళాశాల అకడమిక్ డీన్ శిరీష చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి స్వాతి మాట్లాడుతూ కళాశాలలో అన్నింటిలో బెస్ట్ ఇచ్చిన విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రధానం చేయబోతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా మన డేర్ కళాశాల నుంచి కోర్సు పూర్తి చేసిన అనేకమంది పూర్వ విద్యార్థులు దేశ విదేశాలలో గవర్నమెంట్ లేక ప్రైవేట్ ఉద్యోగాలను మరియు కొంతమంది స్వయం ఉపాధి పొంది ఉన్నారని ఈ సందర్భంగా వారి అందర్నీ ఆలమ్మి కనెక్ట్ ప్రోగ్రాం ద్వారా చదువుతున్న విద్యార్థులకు, చదువు పూర్తి చేసిన విద్యార్థులను కలిపి తద్వారా వారికి వివిధ కంపెనీలలో ప్లేస్మెంట్ కొరకు చక్కని అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్, కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి స్వాతి, ఎన్ఎస్ఎస్ మరియు యుబిఏ కోఆర్డినేటర్ రమ్యశ్రీ, వివిధ విభాగాల అధిపతులు రవికుమార్, రమేష్ శిరీష, పుల్లయ్య, సంజన, రవి, కళాశాల సిబ్బంది ప్రవీణ్, ప్రసన్న, రెహానా, యశోద సుజాత, రామకోటి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .