గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళా హెచ్ఎం వార్డెన్ నియమించాలి

జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి..ప్రతి నెల ఐటీడీఏ అధికారి పాఠశాలలో తనిఖీలు నిర్వహించాలి...

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళా హెచ్ఎం వార్డెన్ నియమించాలి

తెలంగాణ ముచ్చట్లు నూగురు వెంకటాపురం ములుగు జిల్లా:

మండలంలోనికొమరం భీమ్ విగ్రహం ఆవరణలో గొండ్వాన సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి హాజరై మాట్లాడుతూ.5వ షెడ్యూల్ ఏరియాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో మహిళ హెచ్ఎం మరియు వార్డులను  మహిళలని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసి బిడ్డలు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న తరుణంలో ఆదివాసి విద్యార్థులకు సంరక్షణ కల్పించే అవసరం ఎంతైనా ఉందని గతంలో చిరుతపల్లి(2) ఆశ్రమ పాఠశాలలో ఆదివాసి విద్యార్థి పై ఒక ఉపాధ్యాయుడు పది సంవత్సరాల క్రితం అత్యసారం చేయడానికి ప్రయత్నం చేశారని ఆయన గుర్తు చేశారు. అలాంటి సంఘటనలు మరలా జరగకుండా ఉండాలంటే, వెంకటాపురం చిరుతపల్లి 1,2 ఆశ్రమం బాలికల పాఠశాలలో మహిళా హెచ్ఎంలు వార్డిన్ లను తక్షణమే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు, ఆదివాసి విద్యార్థులకు రక్షణ కరువైందని ఆశ్రమం పాఠశాలలో ఆదివాసి విద్యార్థులకు మెనూ షాట్ ప్రకారంగా పౌష్టిక ఆహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.వారం క్రితం దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి చెందటం చాలా దారుణమని ఇది ఐటిడిఏ విద్యశాఖ అధికారుల లోపం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, అలాంటి ఘటనలు మరల ఏ ఆశ్రమం పాఠశాలలో జరగకుండా ఉండాలంటే ప్రతినెల ఐటీడీఏ పీవో విద్యశాఖ అధికారులు ప్రతి నెల ఆశ్రమ పాఠశాలను తనిఖీలు నిర్వహించాలని అన్నారు.అలాగే వారికి అన్ని సౌకర్యాలు అందే విధంగా చూడాలన కోరారు.గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళ హెచ్ఎం మరియు వార్డెన్ ను నియమించకపోతే జి.ఎస్.పి ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతావని హెచ్చరించారు,ఈ సమావేశంలో జిఎస్పి ములుగు జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు పూనేం ప్రతాప్,ప్రధాన కార్యదర్శి కనితి వెంకటకృష్ణ,పాయం కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .