యస్.బి.ఐ.టి. లో ఉద్యోగ ప్రణాళికలపై అవగాహానా సదస్సు

యస్.బి.ఐ.టి. లో ఉద్యోగ ప్రణాళికలపై అవగాహానా సదస్సు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

మన భవిష్యత్తు నేడు మనం చేసే చర్యలపై ఆధారపడి ఉంటుందని యస్.బి.ఐ.టి. కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ తెలియజేసారు. స్థానిక కళాశాలలో మంగళవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, వాటి కోసం రచించవలసిన ప్రణాళికలపై అవగాహనా సదస్సులో కృష్ణ ప్రసంగిస్తూ కళాశాలలో చేరిన మొదటి రోజునుండే విద్యార్థులు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, తద్వరా పోటీ ప్రపంచంలో మనుగడ సులభతరమవుతుందని విద్యార్థులకు దిశానిర్ధేశం చేసారు. ఈ అవగాహనా సదస్సులో ఒరాకిల్, హెరేడియస్ మరియు వోడ్మేడ్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిదులను పిలిపించి, వారి అనుభవాలను, వారి ప్రణాళికలను విద్యార్థులతో పంచుకోవడం ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేసం కలిగించామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్టాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు.

లెర్నింగ్ పాత్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఓపెన్ సోర్స్ వంటి ఆధునిక వనరుల గురించి విద్యార్థులకు అవగాహాస కలిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను వారు సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శతాబ్ది చక్రబోర్తి, అప్లికేషన్ డెవలపర్, ఒరాకిల్, యాష్ గుప్త, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్- 2, హైరాడస్, జయకుమార్ రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్- 2, మాడ్మెడ్ ఇండియా, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా॥ కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా॥ జె. రవీంద్రబాబు, డా|| యస్. శ్రీనివాసరావు, టి.పి.ఒ. యన్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .