ఆర్బిఐ90 క్విజ్ పై డిగ్రీ విద్యార్థులకు అవగాహన

ఆర్బిఐ90 క్విజ్ పై డిగ్రీ విద్యార్థులకు అవగాహన

IMG-20240911-WA0030ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి క్విజ్ కండక్ట్ చేసి బహుమతులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు డిస్ట్రిక్ లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాల్వంచ లో విద్యార్థులకు అవగాహన కల్పించి స్టూడెంట్స్ ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్బిఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఆర్బిఐ 90 పేరుతో క్విజ్ పోటీలు నిర్వహిస్తుందని, విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు నాలుగు దశలో ఉంటాయని మొదటగా ఆన్లైన్ ప్రారంభమై స్టేట్, జోనల్, ఫైనల్ దశల్లో పోటీలు జరుగుతాయని అన్నారు. ఆసక్తి ఉత్సాహం ఉన్న విద్యార్థులు https://www.rbi90quiz.in వెబ్ సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని, 2024 సెప్టెంబర్ 1 నాటికి 25 ఏళ్లు వయసులోపు ఉండి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ పోటీలకి అర్హులని వారు తెలియజేశారు. ఈ క్విజ్ లో పాల్గొనేందుకు ఒక కళాశాల నుంచి ఎంతమంది అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఆంగ్లం హిందీ భాషల్లో పోటీ ఉంటుందని, దేశ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు, ఆర్బిఐ డిజిటల్ కరెన్సీ, ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, క్రీడలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక, సమకాలిని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ గా ఇస్తారని, దీనిలో ప్రైజ్ మనీ వివరాలు స్టేట్ లెవెల్ లో మొదటి బహుమతి రెండు లక్షలు, ద్వితీయ బహుమతి లక్షన్నర, తృతీయ బహుమతి లక్ష ఉంటుందని అదేవిధంగా జోనల్ లెవెల్ లో ఐదు లక్షలు, నాలుగు లక్షలు, మూడు లక్షలు, నేషనల్ లెవెల్ లో పది లక్షలు, ఎనిమిది లక్షలు, ఆరు లక్షలు అందజేస్తారని, క్విజ్ లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలియచేసారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఈనెల 17 వరకు ఉంటుందని, ఆన్లైన్ క్విజ్ ఈనెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని అర్హులైన ప్రతి విద్యార్థి క్విజ్ లో పాల్గొని సర్టిఫికెట్ పొందవచ్చునని ప్రతిభ కనబరిచి బహుమతి కూడా పొందవచ్చునని ఈ అద్భుత అవకాశం వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మ, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .