విద్యార్థుని, విద్యార్థులకు ఫోక్సో యాక్ట్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పై అవగాహన
-- జిల్లా మహిళా సాధికారిక జెండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం మది గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా మహిళా సాధికారిక జెండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శ్రీవాణి పోక్సో యాక్ట్ 2012, సైబర్ నేరాలు మరియు మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాల గురించి విద్యార్థిని, విద్యార్థులకు వివరించారు. రోజురోజుకు మైనర్ బాలికలపై జరుగుతున్నటువంటి తరుణంలో ఫోక్సో యాక్ట్ 2012 జీవితకాల శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులు మాదకద్రవ్యాల పాడిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే సైబర్ నేరాలపై బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై శ్రీవాణి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారిక కేంద్ర జెండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం(DHEW) జెండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి విద్యార్థినీ విద్యార్థులకు
ఫోక్సో యాక్ట్ 2012
సైబర్ నేరాలు మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు గురించి వివరించడం జరిగింది


Comments