నాణ్యతను తనిఖీ చేసి, నివేదికను సమర్పించాలి 

-అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్

నాణ్యతను తనిఖీ చేసి, నివేదికను సమర్పించాలి 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

జిల్లాలో చేపడుతున్న బుధవారం ప్రభుత్వ పాఠశాల భోజనం కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొని, విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేయాలని, పాఠశాలలో వసతులు, భోజన నాణ్యతను తనిఖీ చేసి, నివేదికను సమర్పించాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన చేసి, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అదనపు కలెక్టర్ భోజనం చేశారు. విద్యార్థులతో వసతులు, మెనూ ప్రకారం భోజనం పెడుతుంది అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, యూనిఫామ్, పాఠ్య, నోట్ పుస్తకాలు అందిస్తున్నట్లు, ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నట్లు ఆయన అన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, తల్లిదండ్రులు ప్రయివేటు పాఠశాలలకు పిల్లలను పంపి, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .