పిల్లలని బాధ్యతగా పెంచాలి - డీసీపీ షేక్ సలీమా
కాజీపేట తెలంగాణ ముచ్చట్లు:
తల్లిదండ్రులు అమ్మాయిలను ప్రేమగా , అబ్బాయిలను బాధ్యతగా పెంచాలని నగర డిసిపి సలీమా అన్నారు. కాజీపేట లోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బిటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిసిపి షేక్ సలీమా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విలువైన మార్గదర్శకత్వాన్ని సూచించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల బాలికలు తమ భద్రతను చూసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని భద్రతా సౌకర్యాలను సద్వినియోగ చేసుకోవాలని ఆమె కోరారు. ముఖ్యంగా షీ టీమ్స్, అబ్బాయిలు మద్యపానం ధూమపానం ఈరోజుల్లో ముఖ్యంగా సోషల్ మీడియాకు బానిసలు కావద్దని ఆమె సూచించారు. ప్రస్తుతం బాలురు బాధ్యతారహితమైన డ్రైవింగ్ తో ప్రమాదాలకు గురై తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన, మహిళల గోప్యత లైంగిక వేధింపులు మొదలైన అనేక కేసులను చూస్తున్నందుగా అబ్బాయిలు అమ్మాయిలు సోషల్ మీడియాకు బానిసలు కావద్దని ఆమె విద్యార్థులను కోరారు. ఉపాధ్యాయులతో పాటు పిల్లల సంక్షేమానికి కూడా సమానంగా బాధ్యత వహిస్తారన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం మాట్లాడుతూ క్యాంపస్ లో ఉన్నత ప్రమాణాలు క్రమశిక్షణ సాధించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు డాక్టర్ తాళ్ల వంశీ, చైతన్య డాక్టర్ తాళ్ల వరుణ్, ప్రిన్సిపల్ ఆర్ వేలు, పరిశ్రమలు వినయ్ కుమార్ ఎస్ హెచ్ ఓ మడికొండ కిషన్, డాక్టర్ విజయలక్ష్మి, మహేంద్ర రెడ్డి, భాగ్యలక్ష్మి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.


Comments