ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు
మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉపాధ్యాయ వృత్తికి అపారమైన గౌరవం తీసుకువచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి137 వ జయంతి ని పురస్కరించుకొని, మక్తల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,ఆవరణలో ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విగ్రహానికి మక్తల్ మండల నోడల్ అధికారి అనిల్ గౌడ్ పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ,డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రపంచ మేధావి అని, మహోన్నత వ్యక్తిత్వం గలవారని , ఆయన జీవత కాలంలో అనేక పదవులు పొందారని ,ఉపాధ్యాయ వృత్తి మొదలుకొని దేశ అత్యున్నత పదవి అయినా రాష్ట్రపతిగా పనిచేసిన మొట్టమొదటి ఉపాధ్యాయుడని పేర్కొనడం జరిగింది.ఈయన ఏ పదవి లో పనిచేసిన ఆ పదవికి వన్నె తెచ్చారని ,ఆయాన కోరిక మేరకు తన జన్మదినాన్ని ఉపాద్యాయ దినోత్సవంగా జరపాలని కోరగా, 1962 నుండి భారత ప్రభుత్వం సెప్టెంబర్ 5 వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఏ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి ,రవీందర్ ,రాకేష్ ,గోపాల్ రెడ్డి ఉపాధ్యాయులు ,శంకర్,గోపాల్, రామాంజనేయులు, రాము గౌడ్,వరుణ్,రాం కిరణ్,వివేకానంద,జగదీష్,కృష్ణవేణి ,ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షుడు డివి చారి,అడ్వకేట్ దత్తు తదితరులు పాల్గొనడం జరిగింది.


Comments