ముంపు బాధిత విద్యార్థులకు యస్ బీ ఐ టి ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ

ముంపు బాధిత విద్యార్థులకు యస్ బీ ఐ టి ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

గత వారం ఖమ్మం ను ముంచెత్తిన వరదలతో సర్వం కోల్పోయిన విద్యార్థులకు తమ వంతు గా పుస్తకాలను పంపిణీ చేసినట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. ప్రకృతి వైపరిత్యాలు విద్యకు ఆటంకం కాకూడదనే సదుద్దేశం తో తమ కళాశాల విద్యార్థుల సహకారంతో స్థానిక సారథి నగర్ లో ని ప్రభుత్వ జూబ్లీ పుర పాఠశాల తో పాటు వేంకటేశ్వర నగర్ లోని పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశామని కృష్ణ తెలిపారు.

తమ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో గతవారం ముంపు ప్రాంతాలలో అన్నదానం నిర్వహించామని, తరగతులు మొదలవటంతో అవస్థలు పడుతున్న విద్యార్థులకు అండగా పుస్తకాల పంపిణీ చేపట్టామని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ డా||జి.ధాత్రి తెలిపారు.

తామ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తోట రామారావు మరియు ఏం. ఈ.ఓ. రాములు తమకు సహకరించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా||జి.రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పుస్తక పంపిణీకి ముందుకు వచ్చిన కళాశాల విద్యార్థులకు వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా॥ కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా॥ జె. రవీంద్రబాబు, డా॥ యన్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .