యస్.బి.ఐ.టి. విద్యార్థికి జిల్లా కలెక్టర్ ప్రశంసలు

యస్.బి.ఐ.టి. విద్యార్థికి జిల్లా కలెక్టర్ ప్రశంసలు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

సమాజంలో విప్లవాత్మక మార్పులన్నీ సృజనాత్మకతతోనే సాధ్యమయ్యాయని యస్.బి.ఐ.టి. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ అభిప్రాయపడ్డారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహించిన "ఇంటింటా ఇన్నోవేటర్" కార్యక్రమంలో తమ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి శివకౌషిక్ ఆలోచనకు కలెక్టర్ ముజామిల్ ఖాన్ ద్వారా ప్రశంసాపత్రం అందుకున్నారని వారు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో తమ విద్యార్థి శివకౌషిక్ ప్రశంసలు పొందటం పట్ల కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం వారి తెలంగాణా అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచనలను ఆహ్వానించగా శివకౌషిక్ పంపిన ప్రతిపాదన ఎంపిక అయిందని వారు తెలిపారు.

తెలంగాణా స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వారి ఆధ్వర్యంలో సమాజానికి ప్రయేజనకర ఆలోచనలను ఆహ్వానించిందని తద్వారా ఎంపికైన సృజనాత్మక ఆలోచనలకు తుది రూపును అందిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటుగా సమాజం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, తద్వారా సమాజ శ్రేయస్సులో తమ వంతు బాధ్యతను కలిగి ఉండాలని వారు సూచించారు. ఈ సందర్భంగా ప్రశంసలు అందుకున్న విద్యార్థి శివకౌషిక్ ను వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్నోవేషన్ సెల్ ఇంచార్జ్ డా॥ యన్. శ్రీనివాసరావు, డా॥ స్ఫూర్తి, వైస్ ప్రిన్సిపల్ డా॥ కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా॥ జె. రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .