చదువుతోనే సమాజంలో గౌరవం, గుర్తింపు

జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య

మంచిర్యాల బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

చదువుతూనే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయని, ప్రభుత్వం తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం, హైదరాబాద్ ద్వారా దూర విద్యా విధానంలో ఎస్ఎస్ సి, ఇంటర్మీడియట్ (ఓపెన్ స్కూల్) కోర్సు 2024-25 అందించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నియత పద్ధతిలో ఆర్థిక, సామాజిక కారణాలతో చదువు కొనసాగించలేక మధ్యలో మానివేసిన వారికి, ఉపాధి కోసం పనిచేస్తూ, తీరిక వేయడంలో చదువుకోవాలనుకునే వారికి, అట్టడుగు వర్గాల మహిళలకు, చిన్న ఉద్యోగస్తులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ ద్వారా కోర్సులను అందిస్తుందని తెలిపారు. 14 సంవత్సరాల వయసు నుండి వివిధ కారణాలతో 10వ తరగతి విద్యకు దూరమైన, మధ్యలో బడి మానివేసిన వారు, 10వ తరగతిలో అనుత్తీర్ణులైన వారు, 15 సంవత్సరాల వయసు నుండి వివిధ కారణాలతో జూనియర్ కళాశాల విద్యకు దూరమైన వారు, 10వ తరగతిలో ఉత్తీర్ణులైన యువతి యువకులు ఓపెన్ స్కూల్ ద్వారా అడ్మిషన్ పొంది చదువుకోవచ్చని తెలిపారు. ఈ క్రమంలో అక్టోబర్ 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో www.telanganaopenschool.org వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకుని అడ్మిషన్ పొందాలని తెలిపారు. విద్యాభ్యాసం రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు అని, జ్ఞానం, జీవన నైపుణ్యాలను అందించే విద్య అందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. ఇంటి బాధ్యతలు, ఉద్యోగాలకు ఏమాత్రం ఆటంకం కలగకుండా సెలవు దినాలలో మాత్రమే ముఖాముఖి తరగతులు అధ్యయన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని, అందరికీ అందుబాటులో విద్య అనే నినాదాన్ని అనుసరించి అభ్యాసకులకు పూర్తి స్వేచ్ఛను, కోర్సులు ఎంపికలు పెసలు బాటను కల్పిస్తూ, విద్యను అందించడంలో తనదైన పాత్ర పోషిస్తూ తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఎంతోమంది ఉద్యోగ అవకాశాలను పొందడం జరిగిందని తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యకు దూరమైన వారు, చదవాలనే కోరిక తపన కలిగిన యువతీ యువకులు, కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగస్తులు, వారి చదువులు కొనసాగించుటకు మంచి అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .