ఎన్నికల విధులను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలి....

సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు

ఎన్నికల విధులను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలి....

ఖమ్మం బ్యూరో , నవంబర్ 28, తెలంగాణ ముచ్చట్లు;

ఎన్నికల విధులను అధికారులు ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని  సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు, పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, ఎంసిఎంసి సెల్, మీడియా సెంటర్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల కమీషన్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని, నిబంధనలను రూపొందించిందని వాటిని నిష్పక్షపాతంగా అమలు చేయడం మన కర్తవ్యమని అన్నారు. 1077 టోల్ ఫ్రీ నెంబర్, సామాజిక మాధ్యమాలలో, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ నుంచి వచ్చే ఫిర్యాదులను  వెంటనే క్షేత్ర స్థాయిలో ఉన్న బృందాలకు తెలియజేసి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మండలంలో పనిచేసే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాల వివరాలను నోటీస్ బోర్డు ద్వారా తెలియజేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికలకు సంబంధించి నిరంతరం పర్యవేక్షణ జరగాలని, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ లో నమోదు చేసుకుని వెంటనే  క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలకు సమాచారం అందించాలని అన్నారు. సామాజిక మాధ్యమాలలో ఎన్నికల నిర్వహణ పట్ల అపోహలు కలిగే దుష్ప్రచారాలు గమనించిన వెంటనే  సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమాచారం చేరే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి  ప్రతి బృందం మూడు షిఫ్టులలో 24 గంటల పాటు పనిచేస్తుందని, దానికి అనుగుణంగా సిబ్బంది నియామకం, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, డిపిఓ ఆశాలత, డీపీఆర్ఓ ఎం.ఏ. గౌస్, ఎంసిఎంసి కమిటీ సభ్యులు మురళి, రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.IMG-20251128-WA0002

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్