SBI ఉద్యోగుల ఔదార్యం వరద బాధితుల కోసం రూ.5కోట్లు విరాళం..

SBI ఉద్యోగుల ఔదార్యం వరద బాధితుల కోసం రూ.5కోట్లు విరాళం..

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

వరద బాధితులను ఆదుకోవడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు.సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా తెలంగాణ ఎస్‌బీఐ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు.జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గార్లను ఎస్‌బీఐ ప్రతినిధి బృందం కలిసి రూ.5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు.సీఎం,డిప్యూటీ సీఎంను కలిసినవారిలో ఎస్‌బీఐ సీజీఎం రాజేష్ కుమార్,డీజీఎం జితేందర్ శర్మ,ఏజీఎంలు దుర్గా ప్రసాద్,తనుజ్ తదితరులు ఉన్నారు.వరద బాధితులను ఆదుకోవడంలో ఎస్‌బీఐ ఉద్యోగులు చూపిన ఔదార్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .