అమ్మాయిలు లక్ష్యంతో చదువుకొని ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై నిలబడాలని

అమ్మాయిలు లక్ష్యంతో చదువుకొని ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై నిలబడాలని

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ సహజాది ఉద్బోధించారు. మంగళవారం వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా ఉదయం పట్టణంలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థుల నమోదు పరిశీలించి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని, ఏ సమస్య వచ్చిన ఇంకొకరిపై ఆధారపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్బోధించారు. అది పాఠశాల నుండే ప్రారంభం కావాలని, ఏమైన సమస్యలు ఉంటే ధైర్యంగా ప్రశ్నించాలని సూచించారు. అందుకు తన జీవిత అనుభవాలను ఉదాహరణగా తెలియజేశారు. తాను నిరుపేద కుటుంబం నుండి వచ్చానని, మహిళల హక్కులు, మహిళా సాధికారత కొరకు కృషిచేయడం జరుగుతుందన్నారు. 

 మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనం శిధిలావస్థలో ఉందని సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుండి మార్చాల్సిన అవసరం ఉందని ఆర్.ఎల్.సి. కిరణ్మయిని ఆదేశించారు.

 ఆర్డీఓ పద్మావతి, డిఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్.ఎల్.సి. కిరణ్మయి, ప్రిన్సిపాల్ సౌమ్య , జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హవిల రాణి, ఉపాద్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .