యన్.బి.ఐ.టి. కళాశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
స్థానిక ఖమ్మం యస్.బి.ఐ.టి. ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి ఆవిష్కరించారు. అనంతరం కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవించే స్వాతంత్య్రం అని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనుభవించటం అంటే మరింత భాద్యతగా మెలగటమని తెలిపారు.
కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి మాట్లాడుతూ సాధించిన స్వాతంత్ర్యం భవష్యత్ తరాలు ఫలప్రదం చేసుకోవాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా॥ జి. రాజ్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం పోరాడే స్థాయి నుండి ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదిగామని, ఈ క్రమంలో ఎంతో నేర్చుకున్నామని, ప్రపంచంలో బలమైన శక్తిగా తయారయామని, భవిష్యత్తు మనదేనని వారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా॥ కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా|| జె. రవీంద్రబాబు, డా॥ యన్. శ్రీనివాసరావు, వివిధ విభాగ అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments