సర్వజ్ఞ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
స్థానిక వీడియోస్ కాలనీలో గల సర్వజ్ఞ పాఠశాలలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్స్ ఆర్.వి. నాగేంద్ర కుమార్ మరియు నీలిమ విద్యార్థులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ కృష్ణుడు యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకను జరుపుకుంటామని, కృష్ణాష్టమి ప్రాముఖ్యతను తెలియజేశారు. హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం అని, శ్రీకృష్ణుడి జన్మదినమును జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారని. తెలియజేశారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారని, శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారని తెలిపారు. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తాడని అందుకే ఆయనను అందరూ తమ ఇష్ట దైవంగా కొలుస్తారని తెలిపారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారని, బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు అని పిలుస్తారని తెలిపారు. ఈ పండుగ పిల్లలదే అని సందడంతా వారిదేనని చెప్పారు. పంచ కట్టుకొని కొప్పులో నెమలి కొంచెం మెడలో ముత్యాల హారాలు వేసుకొని అచ్చంగా చిన్ని కృష్ణుడిలా తయారవుతారని తెలిపారు. చిన్నపిల్లలతో కృష్ణుడు గోపికల వస్తాదారణలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.


Comments