స్మార్ట్ కిడ్జ్ ఆధ్వర్యంలో ఘనంగా సరస్వతీ పూజ
-సరస్వతి దేవి ఆశీస్సులు కోసం చిన్నారుల ప్రత్యేక పూజలు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాల ఆధ్వర్యంలో ఆదివారం బ్యాంక్ కాలనీలోని శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో చిన్నారులకు సరస్వతీ పూజ సాంప్రదాయసిద్ధంగా నిర్వహించారు. గణేష్ మండపంలో అర్చకులు చిన్నారుల చేత అక్షరాలు దిద్దించి సరస్వతీమాతకు, గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 150 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేసి వేదమంత్రాలతో సాంప్రదాయకరంగా పూజలతో చిన్నారులకు దీవెనలు అందించారు.ఈ అక్షరాభ్యాస క్రతువుకు కావలసిన పూజా సామాగ్రిని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య అందజేశారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ , మహిళా భక్తులు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తున్నాయని ప్రజల్లో ఐక్యతను సహకార గుణాన్ని , సమిష్టి భావనను వెల్లివిరిసేలా ప్రతిబింబిస్తున్నాయన్నారు.
పూజ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ మోతరపు సుధాకర్,భాస్కర రావు,సతీష్,మధు ,నవీన్ ,ప్రసాద్,విజయకుమారి ,తదితరులు పాల్గొన్నారు.


Comments