ఆదర్శ పాఠశాలలో కాళోజీ జయంతి వేడుక
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు సోమవారం కాలోజీ నారాయణరావు 110 జయంతి సందర్భంగా
"తెలంగాణ భాషా దినోత్సవాన్ని" నిర్వహించడం జరిగింది. పాఠశాల కల్చరల్ కోఆర్డినేటర్, తెలుగు విభాగ అధ్యక్షులు డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల సమక్షంలో "కాలోజీ కవితా పట్టణం"
కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళోజి "నా గొడవ" కవితలలోని తెలంగాణ భాషా స్పురనను , ఉద్యమ స్ఫూర్తిని , మాండలిక భాషా ప్రయోజనాలను , తెలంగాణ పలుకుబడులను ఎంతో భావ స్పూరకంగా విద్యార్థినీ విద్యార్థులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. కాళోజీ కవితా పఠనం కార్యక్రమం ఎంతో వినూత్నంగా, స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జానీ నాయక్ ,గణేష్ ,వెంకటేశ్వర్లు, నాగలక్ష్మి ,మనోజ్ ,మూర్తి ,పావని, సంధ్య, జ్యోత్స్న, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కవితా పఠనం చేసిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


Comments