జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కిరణ్ కుమార్

తెలంగాణ ముచ్చట్లు:
జఫర్గడ్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాలలో పిజిటి సివిక్స్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న రేచవేణి కిరణ్ కుమార్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు-2024 అవార్డుకు ఎంపిక కావడం ,అవార్డు స్వీకరించడం సంతోషమని పాఠశాల ప్రిన్సిపాల్ దేవులపల్లి శ్రీకాంత్ మరియు ఉపాధ్యాయుల బృందం తెలియజేశారు. రేచవేని కిరణ్ కుమార్ జఫర్గడ్ మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా 2018లో అవార్డు స్వీకరించారు. అప్పటినుండి అత్యంత ఉత్సాహంతో, అంకిత భావంతో సేవలను అందిస్తున్నారు. తాను పనిచేసే పాఠశాలలో స్టాఫ్ సెక్రటరీగా, మోడల్ స్కూల్ సంఘం టిఎంఎస్టిఏ జిల్లా అధ్యక్షులుగా, సోషల్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. సోషల్ టాలెంట్ టెస్ట్ లో పలుమార్లు విద్యార్థులను రాష్ట్రస్థాయి వరకు తీసుకెళ్ళారు. అలాగే ఒకవైపు ఉపాధ్యాయుడుగా తన బోధనలో నూతన విధానాలను అవలంబిస్తూ విద్యార్థులకు ఉత్తమ బోధనలు అందించారు. గత దశాబ్ది కాలంగా ఇంటర్మీడియట్ లోను పదవ తరగతి లోను విద్యార్థులు ఉత్తమ ఫలితాలు రావడంలో మరియు 10/10 సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే మోడల్ స్కూల్ నుంచి సుమారు 20 మంది విద్యార్థులు బాసర IIIT లో ఎంపిక అవడంలో ప్రధాన భూమిక పోషించారు.
తన నాయకత్వ పటిమతో జిల్లా, మండల స్థాయి ఉపాధ్యాయ సంఘం నేతలందరితో కలుపుకొని ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తుంటాడు. అలా ఉపాధ్యాయునిగా సామాజిక ఉద్యమకారునిగా ఉన్న రేచవేణి కిరణ్ కుమార్ జనగామ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,మరియూ జిల్లా విద్యాశాఖ అధికారి కే.రాము చేతులమీదుగా అవార్డును స్వీకరించాడు. ఇలాగే అనేక ఉత్తమ సేవలు అందిస్తూ గొప్ప స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయ మిత్రులందరు అభినందనలు తెలియజేశారు.


Comments