రాష్ట్ర స్తాయి పోటీలకు ఎంపికైన ఆర్బిట్ విద్యార్థులు
హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:
శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో ఆగస్టు రెండవ తేదీన జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలలో ఎల్లాపూర్ గ్రామ శివారులో ఉన్న ఆర్బిట్ ఈటెక్నో స్కూల్ పదవ తరగతికి చెందిన ఎం.వినీల్ రెడ్డి జిల్లాస్థాయి మొదటి ర్యాంకు ఎం.స్నేహారెడ్డి జిల్లాస్థాయి రెండవ ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి తెలియజేశారు.జిల్లాస్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు శనివారం రోజున శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమం (శ్రీ రామానుజ చార్య స్వామి విగ్రహం)ముచ్చింతల్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతులమీదుగా జిల్లా మొదటి ర్యాంకు సాధించిన ఎం.వినీల్ రెడ్డి 6000 రూపాయలు నగదు బహుమతి, రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థిని వి.స్నేహ రెడ్డి 3000 నగదు బహుమతి అందుకొని దీవెనలు అందుకున్నారు.
జిల్లాస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ చిట్టి రెడ్డి హారికా రెడ్డి, ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు అభినందించారు.


Comments