పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయుల ఐకాస చైర్మన్, టిఎన్జీవో కేంద్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్

పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

మంచిర్యాల బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయుల ఐకాసా చైర్మన్, టిఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీష్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లాకు విచ్చేసిన ఆయన జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టిఎన్జీవో భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా ప్రతి నెల 1న జీతాలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ లను వెంటనే ప్రకటించాలని కోరారు. అదే విధంగా సిపిఎస్ ను తొలగించి, పాత పెన్షన్ విధానమైన ఓపిఎస్ ను అమలు చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన పిఆర్సి ని ఆమోదయోగ్యమైన శాతంతో వెంటనే ఇవ్వాలని, పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని కోరారు. జిఓ నెంబర్ 317 వలన నష్టపోయిన ఉద్యోగులను, వారి స్థానిక జిల్లాలకు పంపాలన్నారు. సెప్టెంబర్ 1న అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి, విద్రోహ దినం పాటించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇటీవల జరిగిన బదిలీలలో మిగిలిపోయిన స్పౌస్, ఇతర ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, పిఆర్టియు టిఎస్ జిల్లా అధ్యక్షుడు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .