ఈ నెల 21న పొంగులేటి ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభం

ఈ నెల 21న పొంగులేటి ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

పాలేరు నియోజకవర్గంలోని నిరుద్యోగ అభ్యర్థులను రానున్న పోటీపరీక్షలకు సన్నద్ధం చేసే ఉద్దేశ్యంతో రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న పొంగులేటి శ్రీనన్న ఉచిత కోచింగ్ క్యాంప్ ను ఈ నెల 21న బుధవారం ప్రారంభిస్తున్నట్లు.. పొంగులేటి కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఉచిత కోచింగ్ క్యాంప్ కు సంబంధించిన గోడపత్రికను.. క్యాంపు కార్యాలయంలో రైట్ ఛాయిస్ చైర్మన్ మెండెం కిరణ్ తో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం బైపాస్ రోడ్ లో ఉన్న రామ్ లీలా ఫంక్షన్ హాల్ లో ఆగస్ట్ 21న ఉదయం 9గంటలకు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కోచింగ్ క్యాంప్ ప్రారంభమౌతుందని ఆయన తెలియజేశారు. ఇంకా పేరు నమోదు చేసుకోని అభ్యర్థులు ఎవరైనా ఉంటే 8985096699 ఫోన్ నెంబర్ కు వాట్సప్ లో తమ పేరు, ఫోన్ నెంబర్, గ్రామం, మండలం వివరాలను నమోదు చేసుకోవాలని దయాకర్ రెడ్డి కోరారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .