అంబేడ్కర్ వర్సిటీలో అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య

డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం

అంబేడ్కర్ వర్సిటీలో అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య

 ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 డా. బీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ(యూజీ) బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో, పీజీ ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, బీఎల్ఎస్ఐఎస్సీ, ఎంఎల్ఎస్సీ తదితర డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 31వ తేదీలోగా ఆసక్తిగల అభ్యర్థులు ప్రవేశాలు పొందాలని హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి దృశ్య శ్రవణ మాధ్యమం పరిశోధన, అభివృద్ధి కేంద్ర డైరెక్టర్, డీన్ సామాజిక శాస్త్రం ఆచార్య శ్రీనివాస్ వడ్డాణం, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ , ఎస్అర్ అండ్ బిజిఎన్ అర్. కళాశాల, ఖమ్మం రీజినల్ కోఆర్డినేటర్ డా, వీరన్న, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి రసాయన శాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ దొడ్డపునేని కోటేశ్వరరావు లు తెలిపారు. బుధవారం స్థానిక ఎస్.ఆర్. అండ్ బిజిఎన్ఆర్ కళాశాలలోని అంబేడ్కర్ యూనివర్సిటీ ఖమ్మం ప్రాంతీయ అధ్యయన కేంద్రాన్ని డైరెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రీజినల్ కోఆర్డినేటర్ డా. వీరన్నతో కలిసి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఓపెన్ యూనివర్సిటీ డీన్ సామాజిక శాస్త్రం ఆచార్య వడ్డాణం శ్రీనివాసరావు మాట్లాడుతూ, రెగ్యులర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు చేయలేని విద్యార్థులకు, గృహిణులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనుకొనే వారందరికీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 44 సంవత్సరాలుగా అందుబాటులో వుంటు నాణ్యమైన విద్య ను అందిస్తున్నదని తెలిపారు. యూనివర్సిటీ నాక్ - ఎ గ్రేడ్ ని సాధించిందని ఆయన అన్నారు. డిగ్రీ కోర్సులు సెమిస్టర్ సిస్టంలోను, పీజీ కోర్సులు ఇయర్వైజ్ స్కీంలో నిర్వహిస్తున్నామన్నారు. కాంటాక్ట్ తరగతులతో పాటు స్టడీ మెటీరియల్ ని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వివిధ వృత్తులో పనిచేస్తూ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తిచేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సెంటర్లలో ప్రవేశాలు పొందేందుకుగాను విద్యార్హతలు, ఫీజులు, కోర్సుల వివరాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. www.braouonline.in; లేదా www.braou.ac.in లో వివరాలు పొందవచ్చని ఆయన అన్నారు. ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని యూనివర్సిటి అసిస్టెంట్ ప్రొఫెసర్ దొడ్డపునేని కోటేశ్వరరావు తెలిపారు. పూర్తి సమాచారం, సందేహాల నివృత్తి కోసం సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని ఆయన అన్నారు. డిగ్రీ, పీజీ పూర్వవిద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలో సకాలంలో ఫీజులు చెల్లించలేకపోయిన వారు 2015-16 నుంచి 2023-24 వరకు అడ్మిషన్లు పొంది ఉంటే వారు కూడా ఫీజులు చెల్లించేందుకు ఈనెల 31 వరకు గడువు ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .