స్మార్ట్ కిడ్జ్ లో ఉత్సాహంగా రక్షాబంధన్

స్మార్ట్ కిడ్జ్ లో ఉత్సాహంగా రక్షాబంధన్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం రక్షాబంధన్ వేడుకలు ఆనందోత్సవాలలో జరిగాయి. సోదర ప్రేమకు ప్రతీకంగా నిలిచిన రాఖీ పౌర్ణమి ఉత్సాహాన్ని పాఠశాల చిన్నారులు సంబరంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థినీలు తమ తరగతిలోని విద్యార్థులకు రక్షణ కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. అబ్బాయిల ముంజేతికి అమ్మాయిలు రాఖీ కట్టి మిఠాయి తినిపించి తమ సోదర ప్రేమను చాటి చెప్పారు. రాఖీ పౌర్ణమి వేడుకలలో పాఠశాలలో సంబరాలు వెల్లి విరిసాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ అనంతమైన సహోదర ప్రేమకు రక్షాబంధన్ దర్పణంగా నిలుస్తుందని అన్నారు .చిన్నారుల్లో రక్షాబంధన్ విశిష్టతను తెలియజేసేందుకు తమ పాఠశాలలో ఈ వేడుకలను నిర్వహించాము అన్నారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించి మన విద్యార్థుల్లో సోదరభావం పెంపొంది తోటి వారి పట్ల గౌరవం పెరిగి అందరము సమానమనే భావన వెల్లి విరుస్తుందని తెలియజేశారు. తద్వారా సమాజంలో వికృతి భావనలు తొలిగిపోయి ప్రతి ఒక్కరికి రక్షణ కవచంగా నిలవాలని భావన పెరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపాల్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .