పారిశుద్ధ్య కార్మికుల నియామకం వేగంగా జరగాలి
Views: 82
On
మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:
పారిశుద్ధ్య కార్మికుల నియామకం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగిందని వాటికి సంబంధించి తగిన మార్గదర్శకాలు విడుదల చేసి వేగంగా నియామకం చేపట్టాలని తపస్ జిల్లా అధ్యక్షులు షేర్ కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంధర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బడులలో స్కావెంజర్లు లేనందున పారిశుధ్యం పడకేసిందని దీనివల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని అన్నారు. ఈ విషయంపై అధికారులు వేగంగా స్పందించి తగు నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యార్థులకు న్యాయం చేయాలని కొరారు.ఈ కార్యక్రమంలో మక్తల్ మండల ప్రధాన కార్యదర్శి రాకేష్, తపస్ నాయకులు భీమ్ రెడ్డి, నర్సింలు, రవీందర్ రెడ్డి,రవీందర్, రాజంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments