పై ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీకి యస్.బి.ఐ.టి. విద్యార్థుల ఎంపిక

పై ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీకి యస్.బి.ఐ.టి. విద్యార్థుల ఎంపిక

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

విద్యతో పాటు ఉన్నత విలువలు కలిగి ఉండాలని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. స్థానిక యస్.బి.ఐ.టి. కళాశాలలో మంగళవారం నిర్వహించిన పై ఇన్ఫోటెక్ ప్రాంగణ నియామకాలలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో కూడా ప్రాంగణ నియామకాలు చేపట్టడం, వాటిలో తమ విద్యార్థులు ప్రతిభను చాటటం పట్ల వారు హర్షం వ్యక్తం చేసారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు వారు పనిచేసే ప్రాంతంలో విలువలతో కూడిన వ్యక్తిత్వం కలిగి ఉండాలని వారికి దిశనిర్ధేశ్యం చేసారు.

ఐటి సర్వీసెస్ మరియు ఐటి ప్రోవైడర్ కంపెనీ అయిన పై ఇన్ఫోటెక్ సంస్థలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలప్పర్ ఉద్యోగానికి కళాశాలలో జరిగిన ప్రాంగణ నియామకాలలో 185 మంది యస్.బి.ఐ.టి. విద్యార్థులు పాల్గొనగా 72 మంది మౌకిక పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో చివరి దశలో 13 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. పై ఇన్ఫోటెక్ సంస్థకు అర్హత సాధించిన విద్యార్థులకు 3 నెలలు శిక్షణను ఇప్పిస్తారని ఈ సమయంలో వారికి నెలకు 25,000/- రూపాయలు స్టైఫండ్ అందుతుందని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. శిక్షణ అనంతరం వార్షిక ఆధాయంగా 8 లక్షల నుండి 9 లక్షల వరకు అందుతుందని వారు తెలియచేసారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో పై ఇన్ఫోటెక్ హెచ్. ఆర్. డైరెక్టర్ విజయ్ జైస్వాల్, హెచ్.ఆర్. మేనేజర్ పియూష్ తివారి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా॥ కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా॥ జె. రవీంద్రబాబు, డా॥ యన్. శ్రీనివాసరావు, టి.పి.ఒ. యన్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .