చదువుకున్న పాఠశాలకు ఎస్పీ రూపేష్ ఔదార్యం

దాతల సహకారంతో 42 లక్షల చెక్కులు అందజేత

చదువుకున్న పాఠశాలకు ఎస్పీ రూపేష్ ఔదార్యం

ప్రభుత్వ పాఠశాల బలోపేతంపై మమకారం

హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:

కడు పేదరికంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి దేశం గర్వించే విధంగా ఐపీఎస్ సాధించిన హసన్ పర్తి వాసి సంగారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న చెన్నూరి రూపేష్ శనివారం తాను చదువుకున్న స్థానిక ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ క్యాంపస్ ఆవరణలో ఉన్న కళాశాల స్థితిగతులను, బాలికల ఉన్నత పాఠశాల పరిస్థితులను, బాలుర పాఠశాల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు రెండు గంటలసేపు పాఠశాల ఆవరణంలో విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో అవసరమైన కనీస సౌకర్యాలను అడిగి తెలుసుకున్నాడు. పాఠశాలలో డిజిటల్ లైబ్రరీ, జూనియర్ కళాశాలపై సెమినార్ హాల్, ఇతర అవసరాలను తీర్చుటకు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. సంగారెడ్డిలో వందల మందికి ఉపాధి కల్పిస్తున్న ఫ్యాక్టరీల అధినేత సత్యనారాయణ, వినోద్ లు పాఠశాల అవసరానికి 25 లక్షల చెక్కులను కలెక్టర్ ద్వారా పాఠశాల ప్రిన్సిపాల్ లకు అందజేశాడు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో తయారు చేయబడిన సుమారు 7 లక్షల విలువ గల స్టడీ మెటీరియల్ రూపేష్ పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమని అన్నారు. విద్యార్థులు వాటిని ఉపయోగించుకొని ఉన్నత స్థానాలను చేరుకోవాలని, తద్వారా దాతలకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. పాఠశాల ఆవరణంలో అవసరమైన అభివృద్ధి చేయుటకు అమ్మ ఆదర్శ పాఠశాలగా ఎంపికైనందున తమ ద్వారా 10 లక్షల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీల అధినేతలైన సత్యనారాయణను, ఉదయ్ లను పాఠశాల సిబ్బందితో కలిసి ఘనంగా సన్మానించుకున్నారు. తరువాత సత్యనారాయణ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరము మంచి మార్కులతో మొదటి స్థానం సాధించిన విద్యార్థికి 50 వేల రూపాయలను బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపాడు. ఈ కార్యక్రమంలో తాను చదువుకున్న పాఠశాలను మరువకుండా, దాని అభివృద్ధిని భుజస్కందాలపై వేసుకొని ముందుకు వచ్చిన ఎస్పీ రూపేష్ ను పాఠశాల సిబ్బంది, కళాశాల సిబ్బంది, స్థానిక పోలీస్ యువకులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామ్ నరసింహ చారి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, బాలుర స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ సుమా దేవి, స్థానిక నాయకులు విద్యాసాగర్, ఆకుతోట రాంబాబు, చెన్నూరి రవి, శీలం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .