యస్ఆర్ &బిజీయన్ఆర్ ఔన్నత్యం పెంపుదలకే అపూర్వ సమ్మేళనం!
కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మె ళనంలో వక్తలు ఉద్ఘాటన
ఘనంగా గెంటేల నారాయణరావు వర్థంతి
రెండు విలక్షణ పుస్తకాలు ఆవిష్కరణ
హోరెత్తించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాల ఔన్నత్యం పెంపుదలకే అపూర్వ సమ్మేళనం నిర్వహించినట్లు సమ్మేళనంలో పాల్గొన్న వక్తలు ఉద్ఘాటించారు. ఆదివారం ఉదయం స్థానిక ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన అపూర్వ సమ్మేళనంలో పెద్దసంఖ్యలో కళాశాల పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. తొలుత సయ్యద్ ఇబ్రహీం ఆద్వర్యంలో కళాశాల భూరి విరాళం దాత గెంటేల నారాయణరావు 65వర్థంతిని ఆయన విగ్రహానికి పూర్వ విద్యార్థులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు.సమావేశంకు ముందు మరణించిన కళాశాల ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ యస్.మణిభూషనా చారి తీర్మానం ప్రవేశపెట్టగా సభ రెండు నిముషాలు మౌనం పాటించింది. అనంతరం ఈ కార్యక్రమంకు అద్యక్షత వహించిన కళాశాల పూర్వ విద్యార్థి సంఘం అద్యక్షులు నల్లమోతు తిరుమలరావు మాట్లాడుతూ కళాశాల ఔన్నత్యాన్ని పెంపొందించడానికి పూర్వ విద్యార్థి సంఘం గత ఏడాది గా కృషి చేసిందన్నారు. మానవీయవిలువలు పెంపొందించడమే ద్యేయంగా తమ సంఘం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆటంకాలు ఎదురైనా సమావేశంకు హాజరైన పూర్వ విద్యార్థులను ఆయన ప్రశంశించారు. సమావేశంలో అతిథిగా పాల్గొన్న డిల్లీ ఇగ్నోప్రోపెసర్ యం యస్ సీనం రాజు మాట్లాడుతూ యస్ఆర్ &బిజీయన్ఆర్ కళాశాల గొప్ప చరిత్ర, సంస్కృతిని సృష్టించిందని అన్నారు. కళాశాల అబివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడాలని కోరారు. సంఘం ప్రదాన కార్యదర్శి వీరెల్లి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ 13రకాలపిజీ కోర్సులు కళాశాలలలో ఉన్నా,అద్యాపకులున్నా ఒక్క తరగతిగది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకోర్టు, ఐటి హబ్ తరలించేపక్షంలో ఆభవనాలు కళాశాలకు కెటాయించాలని కోరారు. కళాశాలపూర్వ విద్యార్థి సంఘం కళాశాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలపరిష్కారం దిశగా ఆలోచిస్తుందన్నారు. హైకోర్టు న్యాయవాది కడారు ప్రభాకరరావు మాట్లాడుతూ కళాశాల ప్రగతిశీల వారసత్వంను అందించిందని కొనియాడారు. భరత్ విద్యాసంస్థలు అధిపతి శీలం వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆనాడు కళాశాల అందించిన మానవీయ విలువలు కొనియాడారు. అనంతరం సభలో"అఖండ జ్ఞానజ్యోతి గెంటేల నారాయణరావు", "చదువులుమ్మ ఒడిలో జ్నాపకాలం!" పుస్తకాలను వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంను నాళ్ళ బానూచందర్, గోపి శెట్టి వెంకటేశ్వరరావులు నిర్వహించారు. రెండు పుస్తకాలు కళాశాల ఔన్నత్యాన్ని పెంపొందిస్తాయని వక్తలు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థి నాయకుడు, ప్రముఖ యాంకర్ పూజారి గణాశంకర్ రూపొందించిన డాక్యుమెంటరీని అతిధులు ప్రారంబించారు. కట్టెకోల చిన నరసయ్య కళాశాలలోని జ్ఞాపకాలను వివరిస్తూ కళాశాల ఇచ్చిన స్ఫూర్తితో సామాజిక స్పృహ కలిగిన మంచి జీవితాన్ని గడిపేందుకు దోహదపడిందని అన్నారు. కళాశాల జ్ఞాపకాలపై కలలు పంచిన జీవితం శీర్షికన తను రచించిన కవితను ఆలపించారు.అపూర్వ సమ్మేళనంకు పెద్దసంఖ్యలో హాజరైన పూర్వ విద్యార్ధులు తమ మిత్రులతో జ్నాపకాలు పంచుకున్నారు. కళాశాల పూర్వ విద్యార్థులు అయిన మల్లం రమేష్ మాట్లాడే బొమ్మ విన్యాసాలు ప్రదర్శించారు. యం.పుల్లయ్య, కాల్వ కట్ట జాన్, గోవింద్, రచయిత దీకొండ చంద్రకళ, రిటైర్ న్యాయమూర్తి మాదార్, బిచ్చల తిరుమల రావు , తదితర పూర్వ విద్యార్థులు ప్రసంగించారు.


Comments