విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి 

విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి 

మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:

మహిళలు, విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షీ టీం పోలీసులు తెలిపారు.అపరిచిత వ్యక్తుల పట్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన టి సేప్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని షీ టీం పోలీసులు బాలరాజు, సమీనా చెన్నయ్య తెలిపారు. మంగళవారం రోజు మక్తల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ,ప్రతిరోజు స్కూలు, కళాశాలకు వచ్చే విద్యార్థులు, మహిళలు టీ సేఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రయాణం చేసే సమయంలో తప్పక ఉపయోగించుకోవాలని తెలిపారు. మహిళలు, బాలికలు ఎక్కువగా తెలిసిన వారితోనే వేధింపులకు గురవుతున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ధైర్యంగా ఉండి షి టీమ్ పోలీసులకు సెల్ No 8712670398 కి లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని.. ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆట కట్టించి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని పోలీసులు సూచించారు. అలాగే విద్యార్థులు సెల్ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలని సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల సమయం వృధా తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని సెల్ఫోన్లో తమ ఫోటోలను అప్లోడ్ చేస్తే వాటిని అదునుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు డిపి లను అశ్లీలంగా తయారు చేసి మోసం చేస్తారని కావున అలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సాధించాలని కోరారు. విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారని అలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు షీ టీం పోలీసులు బాలరాజు, సమీనా, చెన్నయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .