వ్యాసరచనలో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ

వ్యాసరచనలో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

టాటా సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. టాటా బిల్డింగ్ ఇండియా సంస్థ విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు 'స్మార్ట్ ఇండియా నిర్మాణంలో యువత పాత్ర ' అనే అంశంపై దేశవ్యాప్తంగా పలు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఇటీవల నిర్వహించారు. ఈ పోటీల్లో సీనియర్స్ విభాగంలో నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయం విద్యార్థులు గుంటి గణేష్ (10వ తరగతి) దూబ నందిని, బైరు సాయి పూజలు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. జూనియర్స్ విభాగంలో 8వ తరగతి చదువుతున్న మంద నిరోష, ఏడవ తరగతి చదువుతున్న కొదమ సింహం శ్రీహర్ష, నున్నా రుషితలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో టాటా సంస్థ ప్రతినిధులు తుమ్మారపు భార్గవ్, సోమిరెడ్డిలు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్, ప్రిన్సిపల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు గంగుల ప్రశాంతి, బోళ్ళ రేణుక, గోపీచంద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .