అంగన్వాడి కేంద్రాల్లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం
--- ఐసిడిఎస్ సూపర్వైజర్ సుద ను సన్మానించిన అంగన్వాడి టీచర్లు
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి పల్లి అంగన్వాడి కేంద్రంలో గురువారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సుప్రవేజర్ సుధా ను పెద్దమందడి మండలం అంగన్వాడి టీచర్లు ఘనంగా పూలు, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ.. మొట్టమొదటిగా చిన్నారులు అంగన్వాడి కేంద్రాల్లోనే అభ్యాసిస్తారని పిల్లల భవిష్యత్తు అంగన్వాడి టీచర్లు టీచర్ బాధ్యత ఉందని అన్నారు మొదటి మెట్టు అంగన్వాడి కేంద్రం నుండే చిన్నారులకు అభ్యాసం ప్రారంభం అవుతుందని అన్నారు. చిన్నారుల భవిష్యత్తు అంగన్వాడి టీచర్లు తీర్చేదిద్దాలని అన్నారు టీచర్లు సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నారాయణమ్మ. వెంకటేశ్వర్ మ్మ. వివిధ గ్రామాల అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.


Comments