సర్వజ్ఞలో తెలంగాణ విమోచన దినోత్సవం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
స్థానిక వీడియోస్ కాలనీలో గల సర్వజ్ఞ పాఠశాలలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి, పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ... హైదరాబాద్ సంస్థానం మాత్రం మరో 13 నెలల పాటు నిజాం నిరంకుశత్వ పాలనలో మగ్గింది. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత్ ప్రభుత్వ 'ఆపరేషన్ పోలో' సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినా, నిజాం పాలనలో నీ హైదరాబాద్ స్టేట్ ప్రజలకు మాత్రం స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేందుకు మరో ఏడాది సమయం పట్టింది. ఈ మహా తర ఘట్టం పూర్తవడం వెనుక కేంద్ర ప్రభుత్వం సైనిక చర్య సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మన ప్రభుత్వం తెలంగాణ విలీన దినోత్సవం నిర్వహించింది. ఇక నుంచి తెలంగాణ విమోచన దినోత్సవమా? విలీన దినోత్సవంమా? అనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం గా జరపాలని నిర్ణయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది అని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్స్ మరియు పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.


Comments