త్రిపుల్ ఐటీలో మెరిసిన పేదింటి కుసుమం

- ఘ‌నంగా స‌న్మానించిన రైస్ మిల్ కార్మికులు 

త్రిపుల్ ఐటీలో మెరిసిన పేదింటి కుసుమం

వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండ‌ల ప‌రిధిలోని జ‌గ‌త్‌పల్లి గ్రామానికి చెందిన నంబి అమృత సాయి త్రిబుల్ ఐటీకి ఎంపికైంది. పేదింటి విద్యార్థిని అయినా అమృత సాయి త్రిబుల్ ఐటీకి ఎంపిక కావ‌డంతో జ‌గ‌త్‌ప‌ల్లి గ్రామంలో రైస్ మిల్ ఆప‌రేట‌ర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో విద్యార్థినిని ఘ‌నంగా స‌న్మానించారు. తండ్రి నంబి శ్రీ‌నివాసులు రైస్ మిల్లులో ఆప‌రేట‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు . త‌ల్లి గృహిణి. 5వ త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బాల‌నగ‌ర్ గురుకుల పాఠ‌శాల‌లో విద్య‌న‌భ్య‌సించిన‌ట్లు తండ్రి నంబి శ్రీ‌నివాసులు తెలిపారు. ఉన్న‌త ల‌క్ష్యంతో చ‌దివి గ్రామానికి, త‌ల్లిదండ్రుల‌కు పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకురావాల‌ని గ్రామ‌స్తులు అమృత సాయిని అభినందించారు. విద్యార్థినిని స‌న్మానించిన వారిలో భాస్క‌ర్ యాద‌వ్‌, గ‌ట్టు నాయుడు, ప‌రుశ‌రాములు యాద‌వ్‌, కురుమూర్తి యాద‌వ్‌, న‌ర‌సింహ యాద‌వ్‌, త‌దిత‌రులు ఉన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .