ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన వేముల భారతీయ ప్రతాప్

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన వేముల భారతీయ ప్రతాప్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

అశ్వరావుపేట పట్టణంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు పట్టణ మాజీ ఎంపీటీసీ వేముల భారతి ప్రతాప్ లు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వేముల ప్రతాప్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో లెక్కల మాస్టారుగా పనిచేస్తున్న బండారు మణికంఠ తన చిన్ననాటి స్నేహితుడని తనతో పాటు కలిసి చదువుకున్న మిత్రుడు ఇటీవల కాలంలో నూతనముగా గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాన్ని సంపాదించి ఇదే ఊరికి ఉపాధ్యాయుడిగా రావడం చాలా సంతోషకరమని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన మిత్రుడు మణికంఠ ఒకపక్క కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ఒక ప్రైవేటు లెక్చరర్ గా కూడా పనిచేస్తూ మరోపక్క కుటుంబ పోషణ కోసం చిన్న దుకాణాన్ని సైతం నడిపిస్తూ కష్టపడి చదివి తన ఎంచుకున్న లక్ష్యాన్ని చేదించడం ఆశ్చర్యం కలిగించిందని వారు అన్నారు. నేటి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మన పిల్లల భవిష్యత్తును వారి భుజస్కంధాలపై వేసుకుని తీర్చిదిద్దే దిశగా ఉపాధ్యాయ వృత్తి సహకరిస్తుందని వారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి శుభాకాంక్షలు తెలియజేశారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .