సమస్యల వలయంలో యస్ఆర్ &బిజీయన్ఆర్!?
పరిష్కారం కొరకు పూర్వ విద్యార్థుల సంఘం కృషి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు
తెలంగాణాలోనే విద్యాసామర్థ్యాలు అందించడంలో, వసతి సౌకర్యాలులో ముందుండి, నాక్ గుర్తింపు లభించినప్పటికీ కళాశాల ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. కళాశాలకు అటానమస్ స్టేటస్ తో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పటికీ కళాశాలలో సౌకర్యాలు "పేరుగొప్ప -ఊరు దిబ్బ" అన్న సామెతను గుర్తు చేసేవిగా ఉన్నాయి. కళాశాల పూర్వ విద్యార్థి సంఘం తమశాయ శక్తుల సమస్యలు పరిష్కారం కొరకు ఈవేదికను వినియోగం చేసుకుంటుందీ. ఈక్రిందిసమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తుంది. ఆదిశగానే కళాశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోతుంది. కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము 1) గతంలో మా పూర్వ విద్యార్థి సంఘం చేసిన విజ్ఞాపన మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూనివర్సిటీ ఏర్పాటు గురించి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్పించారు. ఎస్ ఆర్ అండ్ బిజిఎన్ ఆర్ కళాశాలకు వసతులు, చరిత్ర, న్యాక్++ గుర్తింపుతో యూనివర్సిటీ అర్హత ఉన్నందున ఈ కళాశాలను తమప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా ఈకళాశాలను యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేయాలని మేము కోరుతున్నాం. 2) ఇప్పటికే యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాలలో 12పోస్టుగ్రాడ్యేషన్ కోర్స్ లు నడుస్తున్నాయి. ఈఏడాది అదనంగా కాకతీయ యూనివర్సిటీ ఈకళాశాలకు యంయస్సీ, గణితం కోర్స్ మంజూరు చేసింది. ఈ13 పిజీ కోర్సులకు అధ్యాపకులు ఉన్నారు. అధ్యాపకులు ఉన్నప్పటికీ తరగతి గదులు లేవు. బోధన ఇబ్బందిగా మారింది. ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని పిజీ తరగతుల నిర్వహణ కొరకు కళాశాలలలో తరగతి గదులు నిర్మించాలని పూర్వ విద్యార్థుల సంఘం కోరుతుంది. ఇటీవలనే కళాశాలకు యంయస్సీ గణితం బోధించడానికి అనుమతి లభించింది. 3) జిల్లా కోర్టు సముదాయం, ఐటి హభ్ ఇక్కడ నుండి తరలించే పక్షంలో ఆ భవనాలను యస్ఆర్& బిజీయన్ఆర్ కళాశాలకు అప్పగించాలి. ఇప్పటికే ఖాళీ అయిన కూరగాయల మార్కెట్ నడిచిన స్థలం వెంటనే కళాశాల పిజి సెంటర్ కు అప్పగించాలని సంఘం కోరుతుంది. 4) కళాశాల ప్రిన్సిపాల్ కు తెలియకుండా ఇకనుండి. కళాశాల స్థలం బోధనేతర భవనాలు, ఇతరత్రా వ్యాపార సముదాయాలకు కేటాయించ వద్దని, ఆక్రమణల నుండి కళాశాల భూమిని కాపాడాలని ప్రభుత్వంకు మాసంఘం విన్నవించుకుంటుంది. 5)కాడా బిల్డింగ్ కు సంబంధించి, కళాశాల భూమి వాడుకున్నందుకు చెల్లించిన అద్దె గత 40ఏళ్ళుగా జిల్లా ఉన్నతాధికారి ఖాతాలో ప్రొగుపడి ఉంది, ఆ అద్దె అమౌంట్ మొత్తం కళాశాలకు కెటాయించి కళాశాల మరమ్మత్తులు జరిపించాలని కోరుతున్నాం. 6) కళాశాల ఎదురుగా ఉన్న ఇల్లెందు రోడ్డు(ఇల్లేందు క్రాస్ రోడ్ నుండి యన్టీఆర్ బొమ్మ వరకు)కు మన కళాశాల భూరి విరాళం దాత గెంటేల నారాయణరావు మార్గంగా నామ కరణం చేయాలి. అందుకు ఖమ్మం కార్పొరేషన్ సహాకారం అందజేయాలి. 7)గెంటేల నారాయణరావు విగ్రహంను ఇల్లెందు క్రాస్ రోడ్లో, లేదా ఖమ్మం ట్యాంక్ బండ్ పైన గానీ ఏర్పాటు చేయాలి. 8) ప్రభుత్వం జిల్లాలలో నూతనంగా ప్రారంబిస్తున్న నాలెడ్జ్ హబ్ ను ఈకళాశాలకు కెటాయించాలి. 9) ప్రైవేటు యూనివర్సిటీ ప్రతిపాదనను రద్దు చేయాలి. ఇక స్మృతి వనంగా ప్రకటించిన బొటానికల్ గార్డెన్ నిర్వాహణ నిధుల లేమితో అంతంత మాత్రంగానే ఉంది. కళాశాల ఖాళీస్థలం సైతం ఉపయోగంలోనికి తేవాలసి ఉంది. కళాశాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ డిమాండులను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని కోరుతున్నాము. ఈకార్యక్రమంకు హాజరు కానున్న మంత్రుల దృష్టికి వినతిపత్రం అందజేయడం ద్వారా కళాశాల న్యాయబద్దమైన సమస్యలు తీసుకెళ్ళనున్నట్లు యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అద్యక్ష,ప్రదాన కార్యదర్శులు నల్లమోతు తిరుమలరావు, వీరెల్లి ఆనంద్ కుమార్ లు తెలిపారు.


Comments