అర్హత గల వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

పిఆర్టీయూ టిఎస్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి  

అర్హత గల వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు లిస్టులో పేరు నమోదు చేసుకోవాలని పీఆర్టీయూ టిఎస్ జిల్లా అధ్యక్షులు మందల తిరుపతి రెడ్డి అన్నారు.మంగళవారం పీఆర్టీయూ టిఎస్ మండల శాఖా ఆధ్వర్యంలో ధర్మసాగర్ బాయ్స్ హై స్కూల్ లో వరంగల్-నల్గొండ -ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు మందల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ...ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న,యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన పీఆర్టీయూ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిళి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నందున వారిని గెలిపించుకోవడం చారిత్రక అవసరం అని అన్నారు.ఆ దిశగా అందరూ కృషి చేయాలనీ పీఆర్టీయూటిఎస్నాయకులకు దిశ నిర్ధేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహా అధ్యక్షులు రాఘోత్తంరెడ్డి,రమేష్,జిల్లామహిళాఉపాధ్యక్షురాలుపి.సరస్వతి,మండల శాఖా అధ్యక్షా,కార్యదర్శులు అనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,జాన్ సింగ్,మహిళా ఉపాధ్యక్షురాలు తులసి,ఖాజీపేట్ అధ్యక్షులు మాల కొండారెడ్డి,ఆయాIMG-20241016-WA0005పాఠశాలలఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .