అర్హత గల ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి

అదనపు కలెక్టర్ డి. మధు సూదన్ నాయక్

అర్హత గల ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు 

అర్హత గల ప్రతీ ప్రభుత్వ ఉపాధ్యాయులు, నవంబర్ 6 లోపు వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు అయ్యేలా పటిష్ట కార్యాచరణ చేపట్టాలని జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వరంగల్ - ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కోసం అక్టోబర్ 16, 25 తేదీలలో వార్తా పత్రికలలో మొదటి, రెండవ రిపబ్లికేషన్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, అర్హులైన ఉపాధ్యాయులు నవంబర్ 6 లోపు ఫారం 19 ద్వారా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కొరకు దరఖాస్తులు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 2019 న జరిగిన గత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుండి మొత్తం 3634 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు గా నమోదయ్యారని, ఇందులో 2318 మంది పురుష, 1316 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నట్లు అదనపు కలెక్టర్ అన్నారు. గతంలో నమోదు చేసుకున్న వారు, జరగబోయే ఎన్నికలకు తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ అన్నారు. 1నవంబర్, 2024 కు ముందు 6 సంవత్సరాలలో కనీసం మూడు సంవత్సరాల పాటు సెకండరీ స్కూల్ కంటే తక్కువ స్థాయి కాకుండా విద్యా బోధనలో నిమగ్నమై ఉన్న ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు కావడానికి అర్హులని అదనపు కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితాలను ఎన్నికల ముందు ప్రతిసారి కొత్తగా తయారు చేస్తామని, గతంలో ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా ఫారం -19 ప్రకారం నూతనంగా దరఖాస్తును నవంబర్ 6 లోపు సమర్పించాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ అన్నారు.అర్హులైన ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సంబంధిత సర్టిఫికెట్లను జత చేస్తూ ఫారం 19 ప్రకారం తహసిల్దార్ కార్యాలయం, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం నందు మాన్యువల్ గా లేదా ceotelangana.nic.in అనే వెబ్ సైట్ లో ఆన్లైన్ ద్వారా నవంబర్ 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .