మేమేం పాపం చేశాం నాన్న!

మేమేం పాపం చేశాం నాన్న!

కామారెడ్డి,తెలంగాణ ముచ్చట్లు:

ఇల్లరికం వచ్చాడని అల్లుడిపై చిన్నచూపు చూసిన అత్తా మామలు.. మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రిమహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయగావకు చెందిన శ్రీనివాస్ రెడ్డి(36) 12 ఏళ్ల క్రితం కామారెడ్డి జిల్లా నందివాడకు చెందిన చిట్టెపు గుండారె, సుగుణవ్వల కుమార్తె అపర్ణను వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చాడు. అయితే కొన్ని రోజులుగా శ్రీనివాస్ రెడ్డికి భార్య, అత్తమామలతో విభేదాలు వచ్చాయి.. నువ్వు ఇల్లరికం వచ్చావ్ అంటూ అత్త మామ, భార్య పెత్తనం పెరగడం ఆయనను మరింత మనస్తాపానికి గురిచేసింది. దీంతో 6 నెలల నుంచి శ్రీనివాస్ రెడ్డి వేరుగా ఉంటున్నాడు. క్రికెట్ బెట్టింగ్, జూదానికి అలవాటు పడిన శ్రీనివాస్ రెడ్డి రూ.లక్ష వరకు అప్పు చేసినట్లు తెలిసింది. ఇలా కుటుంబకలహాలు, అప్పులు పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతోదసరా సందర్భంగా బంధువులకు జమ్మి పెడతానని కుమారులు విగ్నే శ్రీరెడ్డి(4), అనిరుధ్ రెడ్డి(6)లనుతీసుకెళ్లాడు. వ్యవసాయ భూమి పక్కన ఉన్న బావిలో ఇద్దరు పిల్లలనుతోసి, ఆపై తాను కూడా దూకాడు. మరుసటిరోజు తెల్లవారుజామున ముగ్గురిమృతదేహాలుబయపడ్డాయి..పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .