మొండ్రాయిలో ఘనంగా గాంధీ జయంతీ వేడుకలు
అనంతరం గ్రామా సభ నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ రమేష్ గ్రామా పంచాయితీ సిబ్బందికి సన్మానo

సంగె0,తెలంగాణ ముచ్చట్లు:
సంగేమ్ మండలం మొండ్రాయి గ్రామా పంచాయితీ ఆవరణలో మహాత్మ గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పంచాయితీ కార్యదర్శి అనిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మహత్మ గాంధీ అని,అందుకే ఆయనను జాతిపిత అని గౌరవిస్తామని తెలిపారు.గాంధీజీ అహింసో పరమో ధర్మః అని,ప్రతి ప్రాణి పట్ల ప్రేమ,దయ,కరుణ చూపాలని సూచించారన్నారు.
అనంతరం 2024-25 సంవత్సరానికి గాను జాతీయ ఉపాధి హామీ పథకంలో చేయాల్సిన పనులను గుర్తించి ప్రణాలికను రూపొందించి పలు తీర్మానాలు చేశారు.ఈ సందర్బముగా జాతీయా ఉపాధి హామీ పథకంలో భాగంగా చేసిన పనులను చేయాల్సిన పనులను ఫీల్డ్ అసిస్టెంట్ వేల్పుల సూరయ్య ప్రజలకు వివరించారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామా పంచాయితీ సిబ్బందికి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమేష్,పంచాయితీ కార్యదర్శి అనిత,ఫీల్డ్ అసిస్టెంట్ వేల్పుల సూరయ్య,గ్రామ పంచాయితీ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments