కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
తెలంగాణ ముచ్చట్లు, మందమర్రి:-
ప
ట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంగడి బజార్ లో కల గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సోత్కు సుదర్శన్ లు మాట్లాడుతూ, ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకుల అగ్రగన్యడు మహాత్మా గాంధీ అని, అందుకే ఆయనను జాతిపిత అని గౌరవిస్తారని తెలిపారు. గాంధీజీ అహింసో పరమో ధర్మః అని, ప్రతి ప్రాణి పట్ల ప్రేమ, దయ, కరుణ చూపాలని సూచించారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లూరి లక్ష్మణ్, బూడిద శంకర్, ఎండి సుకూర్, ఎండి ఆఫీస్, రాచర్ల రవి, జమాల్పురి నర్సోజి, మహంత్ అర్జున్, శ్రీనివాసరావు, రాచర్ల గణేష్, మెండ భాస్కర్, రంజిత్, రత్నం రవి, సురేందర్, రావుల శ్రీనివాస్, ఇసాక్, చంద్రశేఖర్, జావిద్ ఖాన్, రాయబారపు కిరణ్, నిజాం, మహేష్, రాజేష్, శ్రీనివాస్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.


Comments