ధర్మసాగర్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పరిణామ సిద్ధాంతంపై సదస్సు
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
జీవ పరిణామం ప్రకృతిలో సహజమైన మార్పు అని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ధర్మసాగర్ మండలంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జి ధర్మప్రకాష్ అధ్యక్షత వహించారు.
సదస్సులో “పరిణామ సత్యాన్ని చాటుదాం” అనే అంశంపై జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు కవితా దేవి కీలక ఉపన్యాసం చేస్తూ, ప్రతి జీవి తన పూర్వీకుల నుండి పరిణామంతో ఆవిర్భవిస్తుందని, ఇది సహజ లక్షణమని స్పష్టంచేశారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రచురించిన చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తెలియజేసే పోస్టర్లను ఉపాధ్యాయులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు సురేష్ సమన్వయకర్తగా వ్యవహరించగా, ఉపాధ్యాయులు పద్మజ, రాజమ్మ, కిరణ్మయి, రామకృష్ణ, ప్రసన్నలు పరిణామ సిద్ధాంతాన్ని కణస్థాయి నుండి జీవ స్థాయి వరకు ఉదాహరణలతో విద్యార్థులకు వివరించారు.సదస్సు విద్యార్థులలో పరిణామ సిద్ధాంతంపై ఆసక్తిని, విజ్ఞానాన్ని పెంచింది.


Comments