కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చరిత్ర తెలవదు
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి రజనీ కుమార్
హాసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు బండి రజనీ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి హసన్ పర్తి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చరిత్ర తెలవదని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో రాష్ట్ర ప్రజలు తెలంగాణ తల్లిని ప్రజలంతా ఏకమై స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ప్రజలంతా ఏకమై తెలంగాణలోని ప్రతి పల్లెల్లో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లిని మార్చినంత మాత్రాన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపరని అన్నారు. లక్ష్మీదేవి లాగా సకల ఆభరణాలతో ఉన్న తెలంగాణ తల్లిని పేద దానిని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సమాజాన్ని అవమానించే విధంగా ఉండడాన్ని నిరసిస్తూ హసన్‌పర్తి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి ప్రతిమ కి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరి చంద్రమోహన్, సంఘాల విక్టరీ బాబు, చల్లా వెంకటేశ్వర రెడ్డి, 55 డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్, నద్దునూరి నాగరాజు, సూరం వాసుదేవరెడ్డి, చెంచు విజేందర్, చెంచు రవి, జెట్టి రాజేందర్,మూల దేవేందర్,తోట నాగరాజు,గరిగే మురళి తదితరులు పాల్గొన్నారు.


Comments