సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడిని ఖండిస్తూ ధర్నా
కీసర, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు)
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై లాయర్ రాకేష్ కిషోర్ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మేడ్చల్ జిల్లా కీసర మండలం కేంద్రంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కీసర ప్రధాన చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, జస్టిస్ గవాయి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.సుప్రీం కోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానంలోనే దేశ ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థపై, రాజ్యాంగంపై దాడి చేసినట్టే అని వారు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన లాయర్ రాకేష్ కిషోర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ కీసర పోలీస్ స్టేషన్‌లో రాకేష్ కిషోర్‌పై ఫిర్యాదు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి కట్ట శంకరయ్య, నాగారం పంగ ముత్యాలు, గోధుమకుంట మాజీ ఉప సర్పంచ్ మంచాల రాజలింగం, జలాల్‌పురం మాజీ సర్పంచ్ ఎల్లేష్, బంగారు మైసమ్మ దేవాలయ మాజీ ప్రధాన కార్యదర్శి కుంటోళ్ళ సత్యనారాయణ, తాళ్ల మల్లేష్, శ్రీకాంత్, మాజీ ఉపాధ్యక్షులు బంటు శ్రీనివాస్, కీసరగుట్ట మాజీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు రాగుల రమేష్ ముదిరాజ్, పీపుల్స్ డైరీ రిపోర్టర్ తుడుం బాలకృష్ణ, పండుగ రాజలింగం ముదిరాజ్, మంత్రాల వెంకట్ ముదిరాజ్, కీసర గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఎర్ర సాయిలు, ప్రధాన కార్యదర్శి తుడుం బాలరాజ్, ఉపాధ్యక్షులు ఎంకిర్యాల నర్సింగ్, పట్టా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments