కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతులమీదుగా లబ్ధిదారులకు చెక్కుల అందజేత
మల్లాపూర్, అక్టోబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ మండల పరిధిలోని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్‌లో బుధవారం రోజు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మొత్తం 224 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చే సంక్షేమ పథకాలు. పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లలో ప్రభుత్వ సహాయం లభించడం ఎంతో సంతోషకరం. లబ్ధిదారులు చెక్కులను వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలి” అని సూచించారు.చిల్కానగర్ డివిజన్‌కు చెందిన 34 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్తో కలిసి చెక్కులను అందజేశారు.ఈకార్యక్రమంలో ఎమ్మార్వో వాణి రెడ్డి, కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, శాంతి సాయి, జెన్ శేఖర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Comments