పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి
హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:
హసన్ పర్తి 66వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమము పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారామ్ కర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, రిటైర్డ్ జిల్లా అటవీ అధికారి, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కే. పురుషోత్తం, కార్యదర్శి శ్రవణ్, కోశాధికారి వి.సుధాకర స్వామి జన విజ్ఞాన వేదిక ప్రతినిధి వి.శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా సుజాత విద్య నికేతన్ పాఠశాల యందు మట్టి వినాయక విగ్రహములను విద్యార్థులతో తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని ఈ రోజుల్లో సమాజంలో భక్తితో చేసుకోవలసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను ఆడంబరాలకు వెళ్లి పిఓపితో తయారుచేసిన విగ్రహాలను పూజించి చెరువులో నిమజ్జనం చేయడం వలన నీరు కలుషితమై చెరువులో నివసించే అనేక ప్రాణులు మరణిస్తున్నాయని కాబట్టి పాఠశాల విద్యార్థులచే పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత 22 సంవత్సరాలుగా సుమారు 30 వేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ అవగాహన కల్పించుటకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషాన్ని కలిగి చేస్తున్నదని తెలియజేసినారు .పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షులు కే పురుషోత్తం మాట్లాడుతూ పిఓపి తో తయారుచేసిన రసాయనిక రంగులతో వాడిన వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వలన కోబాల్ట్ నికెల్ మొదలగు క్యాన్సర్ కారక రసాయనాలు కలవడం వలన నీరు కలుషితమై చేపలు మరియు ఆ నీటిని తాగిన పశువులు క్యాన్సర్ బారిన పడుతున్నాయని కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని తెలిపినారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు జూపాక నాగరాజు, ఏ.వెంకట్, అచ్యుత్ రెడ్డి, వై.అరుణ రాధాకుమారి, సబిహ, సుచిత్ర, జి.సంధ్య, సిహెచ్.సంధ్య ప్రవళిక, గీత, దేవిక, అఖిల, భవాని, సరిత, పి.వెంకటేశ్వర్లు, ఈ.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments